రాజవరంలో తెప్పల పోటీ ..

రాజవరంలో తెప్పల పోటీ ..

 ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా చెరువుల పండుగ నిర్వహిస్తున్నట్లు అందులో భాగంగా రాజవరం రిజర్వాయర్ లో తెప్పల పోటీలు నిర్వహించనున్నట్లు ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు నీల గట్టయ్య, ఉమ్మడి వరంగల్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ నీల రాజు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో గట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చిల్పూర్ మండలం రాజవరం రిజర్వాయర్ లో ముదిరాజ్ మత్స్యకారులకు తెప్పల పోటీలు సాయంత్రం 4:00 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆసక్తి గల ముదిరాజ్ మత్స్య కారులు పాల్గొనవచ్చనీ గెలుపొందిన వారికి మెమెంటో, శాలువాలతో సత్కరించి నగదు ప్రోత్సాహకంగా ప్రథమ బహుమతి రూ.5016 లు, ద్వితీయ బహుమతి రూ. 3016 లు, తృతీయ బహుమతి రూ. 2016 లు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, తెలంగాణ స్టేట్ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి లు హాజరుకానున్నట్టు వారు తెలిపారు.