డిల్లెం.. కళ్లెం..!!

డిల్లెం.. కళ్లెం..!!
  • జనగామలో ఘనంగా బీరప్ప బోనాలు
  • తరలి వచ్చిన కురుమలు.. పట్టణంలో భారీ ర్యాలీ
  • ఆకట్టుకున్న డోలు కళాకారుల విన్యాసాలు

ముద్ర ప్రతినిధి, జనగామ:-డిల్లెం.. కళ్లెం.. డోలు దెబ్బలు.. అందుకు తగినట్టు తాలాల మోతలు.. ఒగ్గు కథ గానాలతో జనగామ ప్రాంతం మార్మోగింది. గురువారం తొలి ఏకాదశి సందర్భంగా కురుమలు తమ కుల దైవమైన బీరప్ప బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆ కులస్థులు పెద్ద సంఖ్యంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్ణణంలో సుభాష్‌ చంద్రబోస్‌ బొమ్మ నుంచి పోలీస్‌స్టేషన్‌ , నెహ్రూ పార్క్‌ మీదుగా బీరమ్మ దేవాలయం వరకు బోనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో  డోలు, డప్పు కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో బీరప్ప దేవాలయం చేరుకున్న భక్తులు స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచ రాములు, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్, కురుమ సంఘం యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలేటి రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చిన్నం నర్సింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి జాయ మల్లేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఆలేటి సిద్దిరాములు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి బొరెల్లి సిద్ధులు, బాల్దే ఆంజనేయులు, మోటే దేవేందర్, పట్టణ అధ్యక్షుడు బాల్దే మల్లేషం, కోశాధికారి కేమిడి ఉపేందర్, దయ్యాల శ్రీను, జనగామ మార్కెట్‌ డైరెక్టర్‌‌ సేవెల్లి మధు తదితరులు పాల్గొన్నారు.