ముదిరాజులు అన్ని రంగాల్లో ఎదగాలి

ముదిరాజులు అన్ని రంగాల్లో ఎదగాలి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: ముదిరాజులు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర నాయకులు డాక్టర్ కర్నాల్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెంలో మంగళవారం ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు నీల లింగం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజులు ఆర్థికంగా, రాజకీయ, సామాజికంగా, ఎదుగుదల కోసం కృషి చేయాలని అన్నారు.

రాజ్యాధికారo కోసం కృషి చేయాల్సిన అవసరం ఆసన్నమైనదని రానున్న ఎలక్షన్లలో ముదిరాజు ఐకమత్యంగా పోరాటం కొనసాగించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల సదానంద, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్  చిక్కుడు రాములు, జనగామ జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పిట్టల సురేష్, ఇప్పగూడెం సొసైటీ అధ్యక్షులు అన్నెపు రమేష్, కార్యదర్శి పిట్టల నరేందర్, పెద్దమ్మ గుడి చైర్మన్ పిట్టల శ్రీనివాస్, వీరస్వామి, గొడుగు అయిలయ్య, కొమురయ్య, శ్రీనివాస్, రాములు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.