పోలీస్ కిష్టయ్య వర్ధంతి

పోలీస్ కిష్టయ్య వర్ధంతి

 ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: ముదిరాజ్ యూత్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రం శివుని పల్లిలో తెలంగాణ మళిదశ పోరాట తొలి అమరుడు పుట్టకొక్కుల కిష్టయ్య(పోలిస్ కిష్టయ్య) 14వ వర్ధంతి ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యూత్ కార్యదర్శి గోరంట్ల యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నీల గట్టయ్య, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ భూర్ల శంకర్, శివునిపల్లి మత్య్సపారిశ్రామిక సహకార సంఘ కార్యదర్శి చేన్నురి వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ కార్యవర్గ సభ్యులు పిట్టల అనిల్, ప్రధాన కార్యదర్శి శాగ సురేష్, సభ్యులు శేఖర్, శ్రీకాంత్, నాగరాజ్, శివలింగం, నాయకులు కొండ వేణు, కొండ వెంకటేశ్వర్లు, మ్యాడబోయిన అనిల్, గొరంతల చంద్రు, కొల శ్రీను, సంకెండ్ల వెంకటేష్, చిక్కుడు వేణు, నీల యాదగిరి, చెన్నూరు శంకర్, చెన్నూరు వినయ్ తదితరులు పాల్గొన్నారు.