2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి

2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి

వైయస్సార్ టిపి కోఆర్డినేటర్ 

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వైయస్సార్ టిపి కోఆర్డినేటర్, నియోజకవర్గ ఇన్చార్జ్ సంఘాల ఇర్మియ డిమాండ్ చేశారు. వైయస్సార్ టిపి ఆదేశాల మేరకు జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రాత్రి గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ అంబేద్కర్ వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇర్మియ, శ్రీనివాసులు మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అధ్యక్షులు ఊరడి శ్రీనివాస్, రఘునాథపల్లి మండల అధ్యక్షులు ముసిపట్ల నరేష్ బాబు, చిల్పూర్ మండల అధ్యక్షుడు చిల్పూర్ దార మోహన్ నాయకులు కావటి మహేందర్, రాజన్న, గోవర్ధనగిరి గ్రామ శాఖ అధ్యక్షుడు ముసిపట్ల కుమార్, గోవింద దేవయ్య, వెంకటయ్య విస్రం వెంకటయ్య, ధార ఎల్లయ్య, తోకల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.