రైతు బంధువు మన ముఖ్యమంత్రి 

రైతు బంధువు మన ముఖ్యమంత్రి 
  •  జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీటి పథకాలను చిత్తశుద్ధితో కొనసాగిస్తూనే రైతు రుణమాఫీ ప్రకటించిన రైతు బంధువు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని జడ్పీ చైర్మన్ పాగాల  సంపత్ రెడ్డి కొనియాడారు. రైతు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి గురువారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతు బంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేను రోజుల్లో 19 వేల కోట్లు రైతు రుణమాఫీ పూర్తి చేయాలని ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు ఆదేశించడం అభినందనీయమన్నారు.

రైతు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ కు టిఆర్ఎస్ పార్టీకి రైతాంగం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవేలి క్రిష్ణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ నాయక్, చిల్పుర్ దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల రైతు కోఆర్డినేటర్ జనగాం యాదగిరి, యంపిటిసిల ఫోరం అధ్యక్షులు రవీందర్, సర్పంచులు రాజ్ కుమార్, రఘుపతి, నాయకులు బాలరాజు, తాళ్లపెల్లి సమ్మయ్య, వెంకట్ స్వామి, రాకేష్ రెడ్డి, రవి చంద్ర, హరిబాబు, ఆరురి స్వామి, దయాకర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.