తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ... ఏసీపీ రఘు చందర్

తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు ... ఏసీపీ రఘు చందర్

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: సోషల్ మీడియా వేదికగా గుర్తింపు గల వ్యక్తులను, వ్యవస్థలను, రాజకీయ పార్టీలను కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రఘు చందర్ హెచ్చరించారు. మంగళవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెట్టె పోస్టుల వల్ల వారి వ్యక్తిగత గౌరవానికి, స్వేచ్ఛకు భంగం కలిగించడమే కాకుండా, శాంతి భద్రతల విఘాతం కూడా తలెత్తే అవకాశం ఉన్నది.

ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా గానీ, అసభ్యంగా దూషిస్తూ గానీ ఎవరైనా సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు ఉంటాయని, అలాగే ఇట్టి అసత్య ప్రచారాలు చేసే సోషల్ మీడియా వేదికలపై పోలీస్ దృష్టి ఉంటుందని తప్పుడు సమాచారం పోస్ట్ చేయగానే పోలీసు వారు కేసులు నమోదు చేసుకొని తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారని, గ్రూప్ అడ్మిన్ లు కూడా ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవరించాలని ఏసిపి డి.రఘుచందర్ తెలిపారు. ఆయన వెంట సిఐ రాఘవేందర్ పాల్గొన్నారు.