ఐదేళ్లలో 6 వేల ఓట్లు పెరిగాయి

ఐదేళ్లలో 6 వేల ఓట్లు పెరిగాయి

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో గడిచిన ఐదేళ్లలో 6 వేల ఓట్లు పెరిగాయి. 2019 ఎన్నికల నాటికి 2,36,994 మంది ఓటర్లు ఉండగా అక్టోబర్ 4, 2023 నాటికి 2,42,981 చేరింది. దీంతో 5 వేల 987 కొత్త ఓటర్లుగా తమ పేరును నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల నాటికి 1,17,439 మంది స్త్రీలు ఉండగా 1,16,778 మంది పురుష ఓటర్లు ఉండగా ప్రస్తుత ఎన్నికల నాటికి 1,22,132 మంది స్త్రీలు ఉండగా 1,20,848 మంది  పురుషులు ఉన్నారు. " మండలాల వారిగా" స్టేషన్

ఘన్ పూర్ లో: 20,902 మంది పురుషులు, 21,315 మంది స్త్రీలు మొత్తం కలుపుకొని 42, 217 మంది ఓటర్లు ఉన్నారు.

చల్పూర్ లో: 15,573 మంది పురుషులు, 15,581 మంది స్త్రీలు,1 థర్డ్ జెండర్ తో కలుపుకొని 31,155 మంది ఓటర్లు ఉన్నారు.

ధర్మసాగర్ లో: 18,982 పురుషులు, 19,617 మంది స్త్రీలతో కలుపుకొని 38,599 మంది ఓటర్లు ఉన్నారు.

లింగాల గణపురంలో: 15,537 పురుషులు, 15,739 మంది స్త్రీలతో కలుపుకొని 31,276 మంది ఓటర్లు ఉన్నారు.

రఘునాథపల్లి లో : 21,197 మంది పురుషులు, 21,175 మంది స్త్రీలతో కలుపుకొని 42,372 మంది ఓటర్లు ఉన్నారు.

వేలేరు మండలంలో: 7748 మంది పురుషులు, 7693 మంది స్త్రీలతో కలుపుకొని 15,441 మంది ఓటర్లు ఉన్నారు.

జఫర్గడ్ లో: 16,014 మంది పురుషులు, 15,980 మంది స్త్రీలతో కలుపుకొని 31, 994 మంది ఓటర్లు ఉన్నారు.

కాజీపేటలో: 2134 మంది పురుషులు, 2191 మంది స్త్రీలతో కలుపుకొని 4325 మంది ఓటర్లు ఉన్నారు.

అయినవోలు లో: 2761 మంది పురుషులు, 2841 మంది స్త్రీలను కలుపుకొని 5602 ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల నాటి ఓటర్లతో పోల్చుకుంటే ఈ ఎన్నికల నాటికి 5987 ఓట్లు పెరిగాయి.