హక్కుల పరిరక్షణకై ఉద్యమించాలి - మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు 

హక్కుల పరిరక్షణకై ఉద్యమించాలి - మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు 

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: హక్కుల పరిరక్షణకై మహిళలు ఉద్యమించాలని మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య పిలుపునిచ్చారు. మహిళా హక్కుల పరిరక్షణకై అక్టోబర్ 5న ఢిల్లీలో నిర్వహించే ర్యాలీ విజయవంతం చేసేందుకు మహిళా సంఘం నిర్వహిస్తున్న జీప్ జాత శుక్రవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం చేరింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అహల్య, కార్యదర్శి షబానా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు భద్రత భరోసా కల్పించాలన్నారు. నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కేరళ తరహాలో 14 రకాల వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించాలని, ఈజీఎస్ పని దినాలు పెంచి రోజు కూలి రూ.600 పెంచాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు 125 గజాల స్థలాన్ని ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం 10 లక్షలు కేంద్రం, 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీప్ జాతాలో మహిళా సంఘం రాష్ట్ర నాయకులు బత్తుల హైమావతి జిల్లా కమిటీ సభ్యులు దైద రాములమ్మ గ్రామ మహిళలు పాల్గొన్నారు.