‘చే’జార్చుకున్నరు..!

‘చే’జార్చుకున్నరు..!
  • కొంప ముంచిన ‘కొమ్మూరి’ గెలుపు దీమా
  • ఒంటెద్దు పోకడలతో ఇందిర ఓటమి

 ముందే చెప్పిన ‘ముద్ర’: ముద్ర ప్రతినిధి, జనగామ/స్టేషన్​ఘన్‌పూర్‌‌ :  రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభంజనం కొనసాగి మ్యాక్‌ ఫిగర్‌‌తో ప్రభుత్వం ఏర్పాటు రెడీ అవుతోంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ గాలి వీచినా జిల్లాలోని జనగామలో కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌‌లో సింగపురం ఇందిర ఓటమి పాలయ్యారు. వీరిద్దరికి గెలుపు దీమా ఎక్కువ కావడం, ఒంటెద్దు పోకడల వల్లే ఓటమిని చవిచూశారని సొంత పార్టీ లీడర్లే గుసగుసలాడుకుంటున్నారు. 

టఫ్‌ ఫైట్‌ ఇచ్చినా తప్పని ఓటమి...
స్టేషన్​ఘన్‌పూర్‌‌లో కాంగ్రెస్ అభ్యర్థి సింగపురం ఇందిర బీఆర్‌‌ఎస్‌ అభ్యర్థి కడియం శ్రీహరికి టఫ్‌ ఫైట్‌ ఇచ్చినా ఓటమి తప్పలేదు. 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రత్యర్థి కడియం రాజకీయ ఎత్తుగడలో చిత్తయిపోయింది. 2018 ఎన్నికల్లో తన బంధువు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య చేతిలో 35,790 ఓట్ల తేడాతో ఓటమి చెందింది. గత ఓటమి, ఈ ఎన్నికల్లో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను తనకు అనుకూలంగా  మలుచుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కర్ణుడు చావుకు 100 కారణాలు అన్నట్టు.. ఆమె చుట్టూ తిరిగే ఐదు ఆరుగురు నాయకులు, అనుభవం లేని సలహాదారులు (పీఏలు), గ్రామ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా ముందుకు సాగిన ఆమె ఒంటెద్దు పోకడే ఓటమికి కారణమైనట్టు తెలుస్తోంది. 

కొంప ముంచిన ‘కొమ్మూరి’ ఓవర్ కాన్ఫిడెన్స్
ఇక కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయన కొంప ముంచినట్టయ్యింది. కొమ్మూరి ఆది నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది.. తాను కూడా ఈజీగా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. ఆ ధీమానే ఆయనకు దెబ్బతీసింది. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థి పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి నియోజకవర్గంలోని ఇంటింటికి వెళ్లి శ్రమించారు. ఇదిలా ఉంటే కొమ్మూరి అభ్యర్థిత్వం ఖారారు అయిన నాటి నుంచి ఉత్సాహంగా ముందుకు సాగారు. కానీ నామినేషన్‌ వేసిన తర్వాత ఆయన ప్రవర్తణలో మార్పు వచ్చిందని పార్టీ వర్గాలే పేర్కొన్నాయి. కొన్ని గ్రామాలు, పట్టణంలోని వార్డులకు ప్రచారానికి కూడా వెళ్లలేదని వారు చెప్పారు. కౌంటింగ్‌లో మొత్తం 20 రౌండ్లు ఉంటే  20 రౌండ్లలో కొమ్మూరిపై పల్లా ఆదిత్యం కొనసాగించి విజయం సాధించారు. అంతే కాకుండా కొమ్మూరి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన చేర్యాల, మద్దూరు, నర్మెట మండలాల్లో కూడా ఆయనపై వ్యతిరేకత ఉందని వచ్చిన ఓట్లను బట్టి స్పష్టం అవుతుంది. అయితే కొమ్మూరి గెలుపు ‘గురి’ తప్పుతున్నాడా.. తీరు మార్చుకోకుంటే ఇబ్బందే.. అని చెబుతూ ‘ముద్ర’ గతంలో ‘హస్తానికి కష్టం’ అనే శీర్షకతో కథనాన్ని కూడా ప్రచురించింది. చెప్పినట్టుగానే కొమ్మూరి ‘గురి’ తప్పాడని ఇప్పడు తెటతెల్లమైంది.