‘పొన్నాల’ పిలుపు.. ‘పల్లా’ గెలుపు

‘పొన్నాల’ పిలుపు.. ‘పల్లా’ గెలుపు

ముద్ర ప్రతినిధి, జనగామ (చేర్యాల) : మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో చేర్యాల మండలంలోని పలు పార్టీల కార్యకర్తలు శుక్రవారం బీఆర్‌‌ఎస్‌ చేరారు. మండలలోని గుర్జకుంట, అర్జున్‌పట్ల, పాత దొమ్మట నుంచి వచ్చిన 200 మందికి పొన్నాల పార్టీ కండువా కప్పి బీఆర్‌‌ఎస్‌లోకి ఆహ్వానించారు.

అనంతరం పొన్నాల మాట్లాడుతూ కేసీఆర్‌‌మూడో సారి ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ‘పొన్నాల పిలుపు.. పల్లా గెలుపు’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.