మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి: బిఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి

మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి: బిఎస్పీ నియోజకవర్గ ఇంచార్జి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి గ్రామపంచాయతీ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జ్ తాళ్లపల్లి వెంకటస్వామి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో జి పి కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 24వ రోజుకు చేరగా పొర్లు దండాలు తీసి నిరసన తెలిపారు. ఈ సమ్మెకు మద్దతు ప్రకటించిన బిఎస్పీ నాయకులు జిపి కార్మికులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రమాద బీమా, వేతనాలు పెంచాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సిద్దయ్య, మండల అధ్యక్షుడు చక్రపాణి, రవి మహిళా అధ్యక్షురాలు రజిని, ప్రధాన కార్యదర్శి జీడి యాకూబ్ జేఏసీ మండల అధ్యక్షుడు కందాలోజు రాజు, కార్యదర్శి రావుల జగన్నాథం, భాస్కర్, బోసు రాజు, సింగపురం కుమార్, గాదరి యాకూబ్, కుంభం రాజు, అప్పల రవి, మారపాక దేవయ్య, బొమ్మగళ్ళ కుమారస్వామి, ఇస్లావత్ రాజశేఖర్, చేపూరి లక్ష్మి, గుండె లక్ష్మి, మేడ కోమల, గుర్రం లక్ష్మి, గోవింద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.