కులచిచ్చు, మత విద్వేషాలు…

కులచిచ్చు, మత విద్వేషాలు…

దేశానికి మంచిది కాదు: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: కుల చిచ్చు, మత విద్వేషాలు మన దేశానికి మంచిది కాదని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ కె ఆర్ గార్డెన్ లో గురువారం మణిపూర్ లో శాంతి నెలకునాలని, క్రైస్తవులపై దాడులు ఆపాలని ఏడు మండలాల పాస్టర్లచే ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి కోసం బిజెపి ప్రయత్నిస్తుంది అన్నారు. ప్రతి మనిషి పుట్టుక ఆక్సిడెంట్.. మతం విశ్వాసం అయినప్పుడు దేశ ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంలో సహజీవనం చేస్తుంటే కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయని పరోక్షంగా బిజెపిని దుయ్యబట్టారు.

మణిపూర్ అల్లర్లను ఆపేందుకు కేంద్రం అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. యూనిఫామ్, సివిల్ కోడ్ అంటున్న కేంద్రం అసమానతలు తొలగించినప్పుడు అది సాధ్యమవుతుందన్నారు. సమ సమాజ నిర్మాణం జరిగినప్పుడు సివిల్ కోడ్, యూనిఫామ్ సాధ్యమని ఇది గ్రామ స్థాయి నుండి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని కులాలను అన్ని మతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. అందుకే గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు లేవన్నది నిదర్శనం అన్నారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ పండుగలను గౌరవించి ఘనంగా జరుపుకున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నారు. పాస్టర్ బాలస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లతా శంకర్, అనిత అశోక్, నరేందర్ రెడ్డి, వెంకన్న, రాజేష్ నాయక్, అయోధ్య, యాదగిరి, రజాక్, లింగారెడ్డి, స్వామి నాయక్ పాస్టర్లు దేవవరం, జాన్ బన్నీ, థామస్, కురియన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.