అంకుర హోమ్స్ కు అవార్డు

 అంకుర హోమ్స్ కు అవార్డు

శంకర్ పల్లి, ముద్ర: కొత్త తరానికి సరిపడే డిజైన్స్, సౌకర్యాలతో రాజీలేని నాణ్యతతో   విల్లాలను నిర్మిస్తున్న హైదరాబాద్ కు చెందిన అంకుర హోమ్స్ సంస్థకు  ఇన్నొవేటివ్ రెసిడెన్షియల్ ప్రోడక్ట్ ఆఫ్ ది  ఇయర్ అవార్డు లభించింది.  ముంబాయిలో  అవార్డును  అంకుర హోమ్స్ సంస్థ భాగస్వామి వెంకట్ మోగంటి  స్వీకరించారు. ఈ సందర్భంగా సంస్థ భాగస్వాములు జైపాల్ రెడ్డి, రవి కాంత్ రెడ్డిలు మాట్లాడుతూ వినూత్న డిజైన్స్ తో గృహాలను నిర్మిస్తున్నామని తెలిపారు.

పచ్చదనం అలలారే పరిసరాల  మధ్య గృహాలను నిర్మిస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలతో అందుబాటు ధరలతో నిర్మిస్తున్న తమ వెంచర్లకు కొనుగోలుదారుల నుండి మంచి స్పందన వస్తున్నదని చెప్పారు. ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తున్నదని తెలిపారు. కొత్తదనంతో మరిన్ని బహుళ అంతస్తుల గల నిర్మాణాలను తమ సంస్థ నిర్మిస్తున్నదని చెప్పారు. ఈ నిర్మాణాలకు అన్ని అనుమతులు ఉన్నాయని వారు తెలిపారు.