కురుమలపై దాడి ఆమానుషం

కురుమలపై దాడి ఆమానుషం
  • కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచ రాములు
  • సోలిపురం బాధితులకు పరామర్శ
  • తామున్నమంటూ భరోసా..

ముద్ర ప్రతినిధి, జనగామ : తరిగొప్పుల మండలం సొలిపురంలో కురుమలపై దాడులు చేయడం అమానుషమని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచ రాములు అన్నారు. బుధవారం ఆయన సొలిపురం గ్రామానికి వెళ్లి బాధిత కుంబసభ్యులను ఆయన పరామర్శించి.. మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కురుమలకు న్యాయం జరిగే వరకు సంఘం తరుఫున పోరాటం చేస్తామని చెప్పారు. సోలిపురంలో 50 ఏళ్ల కింద గొల్లకురుమలు కొన్న భూమిని బీఆర్‌‌ఎస్‌ పార్టీ లీడర్లు అధికారం అడ్డుపెట్టుకొని పాస్‌ బుక్కులు చేయించుకుని దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కురుమ కులస్తులపై దాడి చేసిన, చేయించిన వారినిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు అధికార పార్టీలో ఉన్న కురుమలు ఇటీవల తమ కులానికి ఎంతో చేసినట్లు చెప్పుకున్నారని, అయితే వాస్తవానికి వారు చేసిందేమీ లేదని విమర్శించారు. నింజగా వారికి తమ కుల బంధావులపై ప్రేమ ఉంటే సోలిపురం దాడిపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి జాయ మల్లేశ్, నాయకులు మోటే శ్రీనివాస్‌, బోరెళ్ళి సిద్దులు, జీఎంపీఎస్‌, కేవైసీఎస్‌ నాయకులు అర్ర లక్ష్మి, అర్ర బిరయ్య, చేవిటి యాదయ్య, సాయిల్ల కనుకవ్వ, చెవిటి పద్మ పాల్గొన్నారు.