రఘునాథపల్లి ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

రఘునాథపల్లి ప్రెస్‌క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
  • అధ్యక్షుడిగా మేకల రవీందర్
  •  ప్రధాన కార్యదర్శిగా బంద రవీందర్
  • కోశాధికారిగా సుంకరి శ్రీనివాస్

రఘునాథపల్లి, ముద్ర:  రఘునాథపల్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రఘునాథపల్లి మండలకేంద్రంలోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ ఎన్నిక సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి దస్తగిరి పర్యవేక్షణలో జరిగింది. నూతన అధ్యక్షుడిగా మేకల రవీందర్ (ఆంధ్రజ్యోతి), ప్రధాన కార్యదర్శిగా బంద రవీందర్ (నమస్తే తెలంగాణ), కోశాధికారిగా సుంకరి శ్రీనివాస్ (ప్రజాపక్షం) ఎన్నికయ్యారు.

అలాగే గౌరవ సలహాదారులుగా ఎం.డి దస్తగిరి (అక్షరం), ఆకుల మహేష్ (సూర్య), నాసగోని శ్రీనివాస్(ప్రజాదర్బార్), కొన్నె సతీష్ (మన తెలంగాణ) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సమస్యలపై పోరాడుతామన్నారు. కార్యక్రమంలో రాసమల్ల రాజు, మోదుగు శ్రీనివాస్, కందుల అనిల్ కుమార్ , చిట్యాల స్వామి, ఇమ్మడిశెట్టి శివరాం, బొల్లం రంజిత్, రాసమల్ల యాకస్వామి, దుబ్బాక అజిత్ గౌడ్, రాసమల్ల మల్లేశ్‌, చెర్కు జగన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.