రేవంత్‌ రెడ్డి దొరికిన దొంగ

రేవంత్‌ రెడ్డి దొరికిన దొంగ
Janagama ZP Chairman Pagala Sampath Reddy
  • ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్నడు
  • మంత్రి దయాకర్‌‌రావు ను విమర్శించే అర్హత ఆయనకు లేదు
  • జనగామ జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జనగామ: రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని, జైల్‌లో చిప్పకూడు తిన్నాడని, టీడీపీ కోవర్టుగా కాంగ్రెస్‌లో చేరి వేల కోట్లు పెట్టి టీపీసీసీ పదవి తెచ్చుకున్నాడని జనగామ జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి విమర్శించారు. పాలకుర్తి బహిరంగ సభలో రేవంత్‌ రెడ్డి మంత్రి దయాకర్‌‌రావు పై చేసిన విమర్శలపై సంపత్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. గురువారం జనగామ బీఆర్‌‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్‌‌ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక రేవంత్‌ రెడ్డి లేనిపోని విమర్శలు చేస్తున్నాడన్నారు. దయాకర్‌‌ రావు హయాంలోనే పాలకుర్తి డెవలప్‌ అయ్యిందన్నారు. మంత్రిని విమర్శించే అర్హత రేవంత్‌కు లేదన్నారు.

రేవంత్‌ రెడ్డి చెల్లని రూపాయని, ఆయనను తన సొంత పార్టీ నాయకులే పట్టించుకోవడం లేదని విమర్శించారు. జనగామలో జరిగిన యాత్రకు మాజీ టీపీసీసీ పొన్నాల లక్ష్మయ్య ఆయన వెంట ఉన్నాడని ప్రశ్నించారు. ఆ అసహనంతో నే తమ నేతలపై ఇష్టారితిగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. వచ్చిరాని మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకుంటే రాబోచే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చారించారు. రేవంత్‌ రెడ్డికి నిజంగా దమ్ముంటే పాలకుర్తి నుంచి పోటీ చేసి డిపాజిట్‌ దక్కించుకోవాలని సవాల్‌ విరిసిరారు.  సమావేశంలో రఘునాథపల్లి సర్పంచ్‌ పోకల శివకుమార్, జనగామ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్‌‌పర్సన్‌ విజయ సిద్దులింగం తదితరులు పాల్గొన్నారు. 

బీఆర్‌‌ఎస్‌లో చేరిన డాక్టర్‌‌ సుల్తాన్‌ రాజు
జనగామకు చెందిన కే.కే హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌‌ సుల్తాన్‌  రాజు బీఆర్‌‌ఎస్‌లో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. సుల్తాన్‌  రాజు కు పార్టీ కార్యాలయ కార్యనిర్వాహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పాగాల ప్రకటించారు.