టిఆర్ఎస్ పాలనలో... గిరిజనులకు స్వర్ణ యుగం

టిఆర్ఎస్ పాలనలో... గిరిజనులకు స్వర్ణ యుగం
  • కాంగ్రెస్, బిజెపి నేతలు దద్దమ్మలు
  •  రాజకీయ జన్మనిచ్చిన ఘన్ పూర్ ను వదిలేది లేదు
  • బంజారా భవన్ ముందు బోజ్యా నాయక్ విగ్రహం ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: తొమ్మిదేళ్ల టిఆర్ఎస్ పాలనతో గిరిజనులకు స్వర్ణ యుగం వచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం గిరిజనోత్సవం, కేసీఆర్ కృతజ్ఞత సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం, సిసి, బి టి రోడ్ల నిర్మాణం పంచాయతీ కార్యాలయాలకు నూతన భవనాల నిర్మాణంతో గిరిజనులకు స్వర్ణ యుగం వచ్చిందన్నారు. 9 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో మారుమూల తండాలు అభివృద్ధి చెందాయన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్ పూర్ ను విడిచేది లేదని ఎక్కడ మీకు తల వంపుతేనని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. నియోజకవర్గం కేంద్రంలో రూ. 2 కోట్లతో బంజారా భవన్ నిర్మాణంతో పాటు తెలంగాణ కోసం అమరుడైన భోజ్య నాయక్ విగ్రహం ఏర్పాటు సంత్ సేవాలాల్ భవన్ ను నిర్మిస్తాను అన్నారు. 

టిపిసిసి రేవంత్ రెడ్డి, బిజెపి చీఫ్ బండి సంజయ్ టిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు మానుకోవాలి అన్నారు. 10 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ తెలంగాణ కు ఏం ఒరగబెట్టింది ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు సన్నాసుల, దద్దమ్మలని వారి మాటలు నమ్మొద్దు అన్నారు. నవంబర్ లో ఎన్నికలు రావొచ్చు నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగరవేసేందుకు మనందరం సిద్ధంగా ఉండాలని 40 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఈ సదస్సులో రాజేష్ నాయక్, స్వామి నాయక్, రజాక్, బూర్ల లత, శంకర్, భీకు నాయక్, మొగిలి, సుధాకర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపీటీసీ గిరిజనులు పాల్గొన్నారు.