నేడు దయాకర్ రావు నామినేషన్

నేడు దయాకర్ రావు నామినేషన్

పాలకుర్తి ముద్ర: పాలకుర్తి నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నామినేషన్ను సోమవారం దాఖలు చేయనున్నారు. నామినేషన్లు ఈనెల 3 నుంచి ప్రారంభమయ్యాయి ఇప్పటివరకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. సోమవారం రోజున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నామినేషన్ ను జన సందోహం నడుమ వేయనున్నారు.