మహాత్ముడి అడుగుజాడల్లో పయణించాలి

మహాత్ముడి అడుగుజాడల్లో పయణించాలి
  • జనగామ జిల్లా కలెక్టర్‌‌ శివలింగయ్య

ముద్ర ప్రతినిధి, జనగామ : జాతపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయణించాలని జనగామ జిల్లా కలెక్టర్‌‌ శివలింగయ్య సూచించారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలో సబ్ జైల్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో తెలియక కొంతమంది తప్పులు చేస్తారని, ఆ తప్పులను గుర్తించి సరిదిద్దుకొని సన్మార్గంలో నడుచుకోవాలని కోరారు. జైల్‌లో ఉన్న ఖైదీల కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, వారు బయటకు వెళ్లిన తర్వాత ప్రభుత్వం ద్వారా రుణ సాయం అందించి ఉపాధి మార్గాలు చూపుతున్నట్లు తెలిపారు. ఖైదీలు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని ఎలాంటి ఆందోళనలకు గురికావద్దని సూచించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, జైలర్ పి.కృష్ణ కాంత్, సీఐ శ్రీనివాస్, జైల్ డాక్టర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.