ఉద్యమకారుల సదస్సు పోస్టర్ ఆవిష్కరణ 

ఉద్యమకారుల సదస్సు పోస్టర్ ఆవిష్కరణ 

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఆగస్టు 20 న జరిగే ఉద్యమకారుల చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుల సదస్సు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో లక్ష్యాలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల  కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు.  రాష్ట్ర సంక్షేమ పథకాలలో 20 శాతం ఉద్యమకారులకు కేటాయించాలని, నామినేటెడ్ ప్రాధాన్యత కల్పించాలని ఉద్యమకారులకు పెన్షన్, ఉచిత బస్సు, ట్రైన్ పాసులను, ఇంటి స్థలాన్ని కేటాయించాలని సమరయోధులుగా గుర్తించాలని కోరారు.

కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు పరీదుల శ్రీనివాస్,  ప్రధాన కార్యదర్శి పి.సురేందర్ రెడ్డి, స్టేట్ కో కన్వీనర్ నర్రా సంపత్, రాంబాబు, కంది పెంటాచారీ, కొంతం వీరాస్వామి, ఉద్యమకారుల ఫోరం  నియోజకవర్గం అధ్యక్షులు గుర్రం ఫాతి కుమార్, మండల అధ్యక్షులు నీరటి రవి, సయ్యద్ అజీముద్దీన్, తోట లక్ష్మీనారాయణ, వంగ వెంకటేశ్వర్లు, పింగిలి చంద్రమౌళి, తోట యాదగిరి,  శ్రీరాముల రవి, రహిమతుల్లా  పాల్గొన్నారు.