తెలంగాణలో ఆనాటి కాంగ్రెస్ లేదు చంద్రబాబు కాంగ్రెస్ ఉంది

తెలంగాణలో ఆనాటి కాంగ్రెస్ లేదు చంద్రబాబు కాంగ్రెస్ ఉంది
  • రేవంతు రెడ్డి ఆర్ ఎస్ ఎస్ ఏజెంట్ 
  • రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో చొచ్చిన గాడ్సే 
  • నేటినుంచి కాంగ్రెస్ తీరుకు వ్యతిరేకంగా రైతు వేదికల తీర్మానాలు 
  • కాంగ్రెస్ రైతులకు క్షమాపణ చెప్పే వరకు ఉద్యమిస్తాం: మంత్రి కేటి ఆర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ లీడర్ గా ఉన్నప్పుడు ఉచిత కరెంటు తెచ్చిన విషయం వాస్తవం కానీ ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లేదని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కేటి ఆర్ మాట్లాడుతూ ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండగ అంటే...  చంద్రబాబు ఆశీస్సులుఉన్న  ఏజెంటు (రేవంత్ రెడ్డి) కూడా అదే లైన్ ఎత్తుకున్నాడని విమర్శించారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మీది కాదని చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో, ఆర్ఎస్ఎస్ చెప్పు చేతులు నడిచే కాంగ్రెస్ అన్నారు.  దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడైనా 10 గంటల విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రం ఉందా అని ప్రశ్నించారు. విద్యుతు లాకు బుక్కులు కావాలని అడుగుతున్నారు... దీనిపై ప్రజల్లో చేర్చబడదాం కాంగ్రెస్ గతంలో ఇచ్చిన కరెంటు కావాలా... కెసిఆర్ ఇచ్చిన కరెంటు కావాల అని అడిగి అప్పుడే ఒట్లు అడుగుదామని అన్నారు. ఐదు దశాబ్దాల పాటు రైతు కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ రాసి రంపాన పెట్టింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రైతుల పట్ల అవగాహన రాహిత్యాన్ని బయటపెట్టారు. ఐదు దశాబ్దాల పాటు కరెంటు సాగునీరు విత్తనాలు ఎరువులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా చెరువులు నింపకుండా వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలు చేసింది. రైతుల ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణమైన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న తెలంగాణ రైతుల కడుపుల మీద కొట్టే విధంగా, చాలా దారుణంగా హీనంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వాక్యాలను బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఆన్నారు. తెలంగాణ రైతులకు  కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలి.

 దశాబ్దాల కాలంగా జరుగుతున్న దగా పునరావృతం కావద్దని హెచ్చరిస్తే రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి గాని కనీసం స్పందించకపోవడం శోచనీయం బాధాకరం అన్నారు.  తెలంగాణ రైతులు గుండె మీద చేయి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలి. కెసిఆర్ ముఖ్యమంత్రి కాకముందు జగిత్యాల నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలలో అయిన పెద్దమనిషి చచ్చిపోతే అంత్య క్రియలకు వెళ్లి స్నానాలు చేసేందుకు కూడా కరెంటు ఉండేది కాదు. కాంగ్రెస్ హయాంలో రోజుకు ఆరు గంటలు కరెంటు ఇస్తామని చెప్పి మూడు గంటలు కూడా ఇవ్వలేదు.. ఆనాడు వర్షాకాలం వచ్చిందంటే ఎరువుల దుకాణాలు, విత్తనాల దుకాణం ముందు చెప్పులు వరుసలు పెట్టిన విషయాన్ని రైతులు, ప్రజలు ఓసారి గుర్తు తెచ్చుకోవాలి అన్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఎండాకాలం వస్తే సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు విద్యుత్ అధికారుల నిర్బంధం జరిగేదని ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. భారత దేశ చరిత్రలో స్వాతంత్రం తరువాత రైతుబంధు లాంటి విప్లవాత్మకమైన కార్యక్రమం ఏ రాష్ట్రంలో రాలేదు. బిజెపి, కాంగ్రెస్ పరిపాలిస్తున్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటలు విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఉందా తెలంగాణ తప్ప అని ప్రశ్నించారు. రాష్ట్రంలో  మూడు ఎకరాలు మూడు గంటలు చాలు అంటున్ననోటికొచ్చినట్టు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నది.

 వాస్తవమే కాదా శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్లు చెప్పాలని అన్నారు. కెసిఆర్ బిఆర్ఎస్ విధానం మూడు పంటలు అయితే కాంగ్రెస్ పార్టీ విధానం మూడు గంటలని ఎద్దేవా చేశారు.ఏది మంచో తెలంగాణ రైతులు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రాబందుల్లాగా రాసి రంపాన పెట్టిన రోజులను రైతులు, ప్రజలు గుర్తుకు తెచ్చుకోవాలని, కటిక చీకటినిచ్చే కాంగ్రెస్ కావాలో 24 గంటలు కరెంట్  నిచ్చే బిఆర్ఎస్ కావాలో ఆలోచించాలన్నారు. సుస్కప్రియలు, శూన్య హస్తాలు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ కనీసం జగిత్యాల్లోని అంతర్గామ చెరువును కూడా నింపలేకపోయింది ప్రభుత్వం, ఇక్కడ పని చేసిన మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. వరద కాలవలో 160 కిలోమీటర్లు వరద తలపిస్తోంది.. కాలేశ్వరం తో రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ ని నింపుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగిత్యాల ప్రాంతంలో అంతర్గామ చెరువుతో పాటు 65 చెరువులు నింపమన్నారు. రాహుల్ గాంధీకి ఎడ్లు తెలవదు, వడ్లు తెలవదు కాలేశ్వరం గురించి ఏం తెలుసు స్క్రిప్ట్ రాసిస్తే చదివి వెళ్తాడు. ఆయన లీడర్ కాదు రీడర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ కటిక చీకట్ల కాలం వద్దు 24 గంటలు పాటు కరెంటు ఇస్తున్న కేసిఆర్ పాలనని ముద్దు... మూడు పంటల మాట వినాలి మూడు గంటల విధానం నశించాలనీ రైతు వేదికలో కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి సోమవారమ నుంచి 10 రోజుల పాటు తీర్మానాలు చేస్తున్నామని అన్నారు.  

మూడు గంటల విద్యుత్ ప్రకటన సవరించుకోవాలని డిమాండ్ చేశారు.  ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ అని.. మీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల అని ఎందుకు అన్నాడు.. ఇది రాజకీయ సమస్య కాదు రైతుల సమస్య కెసిఆర్ వ్యవసాయ విధాన బాగుందని మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చిన రైతులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తిరుగులేని క్షమాపణ చెప్పేంతవరకు తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ఉద్యమిద్దాం అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి, తెలంగాణకు ప్రధానమంత్రి వచ్చిన ఏనాడు కూడా ఆయన విమర్శించలేదు. బిఆర్ఎస్ బిజెపి బి అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు మొన్నటి వరకు మహారాష్ట్రలో శివసేవనతో మీరు అంటకాగ లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పూర్వాశ్రమంత ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ అని అన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పునిస్తే కేంద్రానికి వంత పాడింది కాంగ్రెస్ పార్టీ కాదఅని... రైతు వ్యతిరేక విధానాలు, సంఘపరివారు విధానాలను రైతులు అర్థం చేసుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి   గాంధీభవన్లో సొచ్చిన  గాడ్సే లెక్క వ్యవహరిస్తున్నారు అని ఆన్నారు. 70 లక్షల రైతు కుటుంబాలు అడుగుదాం.. తీర్పు చెప్తారని, కాంగ్రెస్ వాళ్ళు  సబ్ స్టేషన్ల వద్దకు వెళ్తే రైతులు, ప్రజలు తన్ని తరిమి వేస్తారన్నారు.  జగిత్యాలను జిల్లా చేసి, మెడికల్ కాలేజీ పెట్టి, ప్రతి పాఠశాల తో పాటు రాష్ట్రంలోని 26వేల పాఠశాలలను బాగు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం.. జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి కంటి వెలుగు పరీక్షలు చేసి అబివృద్ధి చూపిస్తాం అన్నారు.  ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డా. సంజయ్ కుమార్, సుంకే రవి శంకర్, దాసరి మనోహర్  రెడ్డి, జడ్పి చైర్ పర్సన్ దావా వసంత సురేష్ లు పాల్గొన్నారు.