బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం...

బిఆర్ఎస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎమ్మెల్సీ కవితపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అనుచిత వాక్యలు  చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. జగిత్యాల పట్టణంలోని తహసిల్ చౌరస్తాలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా కొద్దిసేపు నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

బిజెపి రాష్ట్ర నాయకుడై ఉండి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం కౌన్సిలర్లు కూసరి అనిల్, జుంబర్తి రాజ్ కుమార్, ఆరుముళ్ళ పవన్, యూత్ అధ్యక్షుడు గిరి, నాయకులు డిష్ జగన్ , చంద్ర పృధ్విధర్, ముదిగం రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.