ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి...

ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి...
  • నృత్యం చేస్తూ పడిపోయిన బిఆర్ఎస్ నాయకుడు...
  • ఆస్పత్రికి తరలింపు చికిత్స పొందు మృతి...

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. నిజాంబాద్ రోడ్ లోని గాంధీనగర్ నుంచి ఎమ్మెల్సీ కవితను ఎదుర్కొనేనదుకు ఏర్పాట్లు చేశారు.ఈ  సందర్భంగా  కొత్త బస్టాండ్ వద్ద నృత్యం చేస్తూ టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు  మున్సిపల్ కౌన్సిలర్ బండారు రజిని భర్త బండారు నరేందర్ కింద పడిపోయాడు. గమనించిన టిఆర్ఎస్ నాయకులు  ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. నరేందర్ గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తుంది. జగిత్యాల పట్టణంలో, బి అర్ యస్ వర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి