ముదిరాజ్ కుల వృత్తులు అభివృద్ధికి ప్రభుత్వం కృషి - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముదిరాజ్ కుల వృత్తులు అభివృద్ధికి ప్రభుత్వం కృషి - ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ముదిరాజ్ కుల వృత్తులు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల అర్బన్ మండల అంబారిపెట్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి జడ్పీ చైర్పర్సన్ దావవసంతతో కలిసి ఎమ్మెల్యే  భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు బందు,రైతు భీమా,కళ్యాణలక్ష్మి ఇలా అనేక పథకాలు కుల మత తేడా లేకుండా అమలు అవుతున్నాయి అన్నారు.

ముదిరాజ్ కులస్తులు గొప్పగా పుజించుకునే పెద్దమ్మతల్లి ఆలయాలకు సైతం నిదులు మంజూరు చేయటం జరిగిందని, పెద్దమ్మ  తల్లి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్, సర్పంచ్ గంగాధర్,ఎంపీటీసీ మల్లారెడ్డి,ఉప సర్పంచ్ నారాయణ,అర్బన్ మండల బిఆర్ ఎస్ కన్వీనర్ జుంబార్తి శంకర్, వెంకటేశ్వర ఆలయ ఛైర్మెన్ బక్కన్న,రైతు బందు సమితి మెంబర్ దూడ వెంకటేష్,గ్రామ శాక మల్లేష్,నాయకులు శంకర్,భారతపు నాగరాజు,గంగాదర్, స్వామి రెడ్డి, గంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.