క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ

క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ

సారంగాపూర్ ముద్ర: సారంగాపూర్ మండలంలోని లక్ష్మీదేవి పల్లి గ్రామంలో సోమవారం క్రీడాకారులకు బిజెపి పార్టీ సారంగాపూర్ మండల శాఖ అధ్యక్షుడు వరుణ్ కుమార్ క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ యువకులు క్రీడల్లో పాల్గొని లక్ష్మీదేవి పల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు బద్దెల గంగరాజo, బిజెపి పార్టీ మండల శాఖ ఉపాధ్యక్షుడు నరేష్, బూత్ అధ్యక్షుడు కంచర్ల సంతోష్, లావుడియా ప్రవీణ్, ఏలేటి రాజేశ్వర్ రెడ్డి, ఎల్లేటి మోహన్ రెడ్డి, బిజెపి పార్టీ మండల సోషల్ మీడియా మండల కో కన్వీనర్ కంచర్ల వేణు తదితరులు పాల్గొన్నారు.