ప్రత్యేక వజ్రాభరణాల కలెక్షన్ & బ్రైడల్ స్టూడియోతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో కీర్తీలాల్స్ 2వ స్టోర్ ప్రారంభం

ప్రత్యేక వజ్రాభరణాల కలెక్షన్ & బ్రైడల్ స్టూడియోతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో కీర్తీలాల్స్ 2వ స్టోర్ ప్రారంభం
Actress Samyukta Menon

హైదరాబాద్, 10 ఏప్రిల్ 2023: నాణ్యమైన వజ్రాభరణాల ప్రపంచంలో సుప్రసిద్ధమైన కీర్తీలాల్స్, హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో తమ రెండవ షోరూంని ప్రారంభించింది. విశాలమైన, శోభాయమైన ఈ షోరూంలో రోజువారీగా ధరించే వాటి నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకూ విస్తృత శ్రేణిలో శ్రేష్టమైన వజ్రాభరణాల కలెక్షన్లను ఒకే చోట అందిస్తోంది. సరికొత్త షోరూమ్‌ను ప్రసిద్ధ దక్షిణ భారతదేశ నటి సంయుక్తా మీనన్ ప్రారంభించారు. కీర్తీలాల్స్ వారి సరికొత్త షోరూమ్‌లో సమగ్రమైన బ్రైడల్ స్టూడియో ఒక ప్రధాన ఆకర్షణ, వధువుల కోసం సంపూర్ణమైన షాపింగ్ అనుభూతిని వినియోగదారులకు అందించేలా ఇది రూపుదిద్దుకుంది. బ్రైడల్ సెట్స్, గాజులు, నెక్లెస్‌లు, చెవిరింగులతో సహా విస్తృతస్థాయిలో బ్రైడల్ జ్యూయెలరీ కలెక్షన్‌ను బ్రైడెల్ స్టూడియోలో అందుబాటులో వుంటాయి.  కొనుగోలు చేయకముందే వినియోగదారులు తమ ఆభరణాల డిజైన్లు ఎలా వుంటాయో చూసుకోవడానికి వీలైన అత్యాధునిక సాంకేతికత ఈ స్టూడియోలో ఉంది.

“హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో మా కొత్త షోరూమ్‌ను ప్రారంభిస్తున్నామని ప్రకటిస్తున్నందుకు ఎంతో ఉత్తేజంగా ఉంది. షోరూమ్‌లో భాగమైన బ్రైడల్ స్టూడియో మా వినియోగదారులకు వధువుల ఆభరణాల షాపింగ్ అనుభూతిని సౌకర్యవంతంగా, గుర్తుండిపోయేలా చేసే విధంగా రూపుదిద్దుకుంది. ప్రత్యేకమైన, అత్యద్భుతమైన ఆభరణాల కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఈ కొత్త షోరూమ్, బ్రైడల్ స్టూడియో ఒక పరిపూర్ణమైన గమ్యం అవుతుందని మేము నమ్ముతున్నాం” అని శ్రీ సూరజ్ శాంతకుమార్, డైరెక్టర్- బిజినెస్ స్ట్రాటజీ, కీర్తిలాల్స్ అన్నారు. కొత్త షోరూమ్ 3,950 చదరపు అడుగుల విశాలమైన ప్రదేశంలో విస్తరించి ఉంది, వినియోగదారులకు సౌకర్యవంతమైన, విలాసవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందించేలా రూపుదిద్దుకుంది. షోరూమ్ అలంకరణ ఆధునికంగా, సొగసుగా, కనులకింపైన రంగులతో ఒక సహృదయమైన, ఆహ్వానించే వాతావరణంతో వుంటుంది.  

కీర్తిలాల్స్ కి నిపుణలైన, అనుభవజ్ఞులైన డిజైనర్లు వున్నారు, వినియోగదారుల మారుతున్న అభిరుచులు, అవసరాలకి అనుగుణంగా వారు ప్రత్యేకమైన, సృజనాత్మకమైన రూపకల్పనలు చేస్తారు. సాంప్రదాయ ఆభరణాల  నుంచి సమకాలీన ఆభరణాల వరకూ రకరకాల శైలుల్లో ఆభరణాలని రూపుదిద్దడంలో ఈ డిజైన్ బృందానికి ఎంతో నైపుణ్యం వుంది, వినియోగదారుల ప్రత్యేక అవసరాలని అర్థం చేసుకుని వారికి వ్యక్తిగతమైనవి తయారు చేయడానికి వాళ్ళతో సన్నిహితంగా కలిసి పనిచేస్తారు. దీనికితోడు, కీర్తిలాల్స్ కి అత్యాధునిక తయారీ కేంద్రం వుంది, కీర్తిలాల్స్ వజ్రాలను స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపించేలా చేసే నాణ్యమైన ఆభరణాలని తయారు చేసేందుకు ఇది వీలుకల్పిస్తోంది. కీర్తిలాల్స్ లో తయారీ క్రమం సాంప్రదాయిక హస్తకళానైపుణ్యం, ఆధునిక సాంకేతికతల మేల కలయికగా సాగుతుంది. ఇంటిగ్రేటెడ్ బ్రైడల్ స్టూడియోతో కూడిన సరికొత్త కీర్తీలాల్స్ షోరూమ్ ఇంటి నెంబరు 1-72/210/5, సైబర్ హిల్స్, లబోనెల్ ఫైన్ బేకింగ్ సమీపంలో, గచ్చిబౌలీ, హైదరాబాద్, తెలంగాణ- 500032 చిరునామాలో ఉంది.

కీర్తిలాల్స్ గురించి:

కీర్తిలాల్ కాళిదాస్ జ్యువెలర్స్ ప్రై. లి. 'కీర్తిలాల్స్' అనే బ్రాండ్ పేరు మీద దక్షిణ భారతదేశంలో 14 ప్రత్యేకమైన షోరూంలు, తన ఆన్ లైన్ స్టోర్స్ www.kirtilals.com ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. మానుఫాక్యరింగ్ యూనిట్ల విషయంలోను, చిల్లర అమ్మకాల విషయంలోనూకూడా ఐఎస్ఒ 9001:2008 ధృవీకరణ సాధించిన తొలి వజ్ర, బంగారు ఆభరణాల బ్రాండ్ కీర్తిలాల్స్. ఈ బ్రాండ్ ప్రధాన దుకాణం కోయంబత్తూర్ లో వుంది. 8 దశాబ్దాలుగా కార్యకాపాలు నిర్వహిస్తున్న వారసత్వంతో, 5 ఖండాల్లో విస్తరించి, 3,00,000 మంది ఖాతాదారుల నమ్మికతో ముందుకు సాగుతోంది. ఈ బ్రాండ్ కి కొయంబత్తూర్ | చెన్నై | మదురై | తిరుప్పూర్ | కొచ్చి | బెంగళూరు | హైదరాబాద్ | విజయవాడ | విశాఖపట్నంలలో రిటైల్ షోరూంలు వున్నాయి, న్యూజెర్సీ, యుఎస్ఎలో సేల్స్ డెస్క్ ఉంది.

9172230001