కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకి టాప్..​ ఐదో స్థానంలో టాటా నెక్సాన్​

కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకి టాప్..​ ఐదో స్థానంలో టాటా నెక్సాన్​

న్యూఢిల్లీ: దేశంలోని రోజురోజుకు కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆయా సంస్థలు కూడా వినియోగదారులకు కావాల్సిన రంగుల్లో, భద్రతా ప్రమాణాల్లో, మైలేజీలో, ధరల విషయంలో ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుల్లో ఆసక్తులు పెరిగిపోతున్నాయి. అంతేగాకుండా ఆయా బ్యాంకులు కూడా కార్లు కొనేందుకు రుణాలను విరివిగా ఇస్తుండడంతో కార్ల సేల్స్​ విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా పదికార్ల సేల్స్​ నిలుస్తున్నాయి. 


ఈ ఏడాది మొదటి నెలలో కూడా అత్యధికంగా కార్లు అమ్ముడయ్యాయి. వాటిల్లో ఎప్పటిలాగే మారుతి సుజుకి మోడళ్లకు జనాల నుంచి డిమాండ్ వచ్చింది. జనవరిలో అమ్ముడైన కార్లలో మారుతి సుజుకీకి చెందిన మోడళ్లే టాప్ ప్లేస్ ఉన్నాయి. వీటి తర్వాత స్థానంలో హ్యూందాయ్ నిలిచింది. మూడో స్థానంలో టాటా మోటర్స్ సాధించింది. 


మారుతి సుజుకీకి చెందిన మోడళ్లలో అల్టో కారు దేశంలోనే అత్యధికంగా అమ్ముడైన కారుగా చరిత్ర సృష్టించింది. వ్యాగన్ ఆర్ అమ్మకాలలో ఒకశాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది దేశంలో జరిగిన అమ్మకాలలో రెండో స్థానంలో నిలిచింది. ఆశ్చర్యకరంగా జనాల నుంచి మంచి డిమాండ్ ఉండే స్విఫ్ట్ కార్లు ఈ సారి తక్కువగా అమ్ముడయ్యాయి. 16,640 యూనిట్ల అమ్మకాలు జరిగాయి గతేడాదితో పోల్చితే ఇది 14 శాతం తక్కువ. అయినప్పటికీ మన దేశంలోని టాప్ సెల్లింగ్ కార్ మోడళ్లలో స్విఫ్ట్ టాప్ త్రీలో నిలిచింది. ఆసక్తికరంగా మారుతి సుజుకీ బాలెనో ఏకంగా 141 శాతం వృద్ధి రేటు సాధించి, దేశంలో ని కార్ల అమ్మకాలలో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఐదో స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. ఆరు, ఏడు స్థానాల్లో హ్యూందాయ్ క్రెటా, మారుతి సుజుకీ బ్రెజ్జా నిలిచాయి. అయితే దేశీయ సంస్థల్లో బెస్ట్ సెల్లర్ గా టాటా నెక్సాన్ నిలువగా.. టాటా కంపెనీలో ఆ తర్వాత స్థానంలో పంచ్ నిలిచింది. ఓవరాల్ గా ఇది ఎనిమిదో స్థానం సాధించింది. ఇక తొమ్మిదో స్థానంలో మారుతి సుజుకీ ఈకో నిలిచింది. పదో స్థానంలో నిలిచిన కారు ఎంటంటే మారుతీ సుజుకీ డిజైర్.