తెలంగాణ స్టార్ట్ అప్ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు

తెలంగాణ స్టార్ట్ అప్ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు

పది లక్షల డాలర్ల నిధి మంజూరు

హైదరాబాద్: ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ కంపెనీలను  ప్రోత్సహించేందుకు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అటల్ ఇన్నోవేషన్ మిషన్ నిర్వహించిన ఒక పోటీలో తెలంగాణకు చెందిన Autocracy Missionary Private Limited Company ఆటోక్రసీ మిషనరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ  పది లక్షల డాలర్ల ప్రోత్సాహక నిధిని గెలుచుకుంది. ఆ సంస్థ  సహా వ్యవస్థాపకురాలు సీఈవో సంతోషి సుష్మ బుద్దిరాజు ఈ బహుమతిని అందుకున్నారు. నీటి పైప్ లైన్లు, విద్యుత్,  ఇంటర్నెట్ కేబుల్స్ కోసం కందకాలు, కాలువలు తవ్వడానికి అవసరమైన పరికరాలు తయారు చేసే ఈ సంస్థ అనతి కాలంలోనే భారీ పురోగతి సాధించింది. నిర్మాణ పనులకు సంబంధించిన పరికరాలను తయారు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించిన ఈ కంపెనీని వి లక్ష్మణ్, సంతోషి సుష్మ కలిసి 2020 లో ఈ కంపెనీని స్థాపించారు.