అత్యవసర ధనం.. ఎల్​ఐసీ ఎమర్జెన్సీ ఫండ్​ బెస్ట్​

అత్యవసర ధనం.. ఎల్​ఐసీ ఎమర్జెన్సీ ఫండ్​ బెస్ట్​
Emergency money.. LIC Emergency Fund is the best

న్యూఢిల్లీ: ప్రతీ మనిషికి అవసరమే.. అత్యవసరంగా మారే సందర్భాలు అనేకం వస్తుంటాయి. ఇలాంటి నేపథ్యంలో చేతిలో డబ్బులేకుంటే అగమ్యగోచరంగానే గాక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. సామాన్య అవసరాలకైతే చిన్నమొత్తాలను చేబదులు ఎవ్వరైనా ఇచ్చే అవకాశం ఉంది కానీ, హెల్త్​ లాంటి ఎమర్జెన్సీ అవసరాల్లో లక్షలు కావాల్సి వస్తే మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవు. అందుకే ప్రతీ ఒక్కరూ ‘అత్యవసర ధనం’. ప్రతీ వ్యక్తి ఏదో ఒక పనిచేస్తాడు. వచ్చిన దాంట్లో నెలనెలా ఎంతోకొంతమొత్తాన్ని తీసి అత్యవసర ధనం కింద దాచుకుంటే చూస్తూ చూస్తూ అదే ఆకాశమంతవుతుంది. దీంతో అత్యవసర సమయాల్లో ఇది పనికి వస్తుంది. అయితే డబ్బు ఉంటే ఖర్చయిపోతుంది కాబట్టి ఇలా జమచేసిన మొత్తాన్ని అప్పటివరకూ అవసరం రాకుంటే ఆయా ఇన్సూరెన్స్​, ఎల్​ఐసీ, మ్యూచువల్​ఫండ్​, ఫిక్స్​డ్​ డిపాజిట్ల వంటి వాటిల్లో కూడా పెట్టుకోవచ్చు. దీంతో మీ సొమ్ము భద్రంగా ఉంటుంది. మీకు పొదుపు అలవాటు అయినట్లు ఉంటుంది. తిరిగి అత్యవసర ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. 


ఎల్‌ఐసీ ఎమర్జెన్సీ ఫండ్​
మ్యూచువల్​ ఫండ్స్​, లోన్స్​.. ఇప్పుడు చాలా వరకు అన్ని ఆటోమెటిక్​గానే కట్​ అయిపోతున్నాయి. ఎమర్జెన్సీ ఫండ్​కి కూడా ఈ వెసులుబాటును ఇచ్చే విధంగా మనం చర్యలు చేపట్టాలి. అప్పుడు మనం మర్చిపోవడానికి వీలు కూడా ఉండదు. వేరే అకౌంట్​ ఏర్పాటు చేసుకోవాలి.. మన సేవింగ్స్​, కరెంట్​ అకౌంట్​ వంటిని, ఎమర్జెన్సీ ఫండ్​తో ముడిపెట్టకూడదు. ఎమర్జెన్సీ ఫండ్​ కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్​ ఉండాలి. ఈ విధంగా.. పొరపాటునైనా ఎమర్జెన్సీ ఫండ్​ నుంచి డబ్బులు తీసే అవకాశం ఉండకుండా చూసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి.. ఎమర్జెన్సీ ఫండ్​లో వేసే నిధులను ఎప్పటికప్పుడు పెంచుకుంటే వెళితే.. మన టార్గెట్​ను తొందరగా చేరుకుంటాం. ఇందుకోసం ఒక చిన్న సలహా ఇస్తుంటారు ఆర్థిక నిపుణులు. కొంత కాలం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని, మిగిలిన డబ్బులను ఎమర్జెన్సీ ఫండ్​లో వేస్తే మంచిదని సూచిస్తుంటారు. ఆదాయాన్ని పెంచుకోవాలి.. సాధ్యమైతే మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి వ్యూహాలను పరిశీలించాలి. దీన్ని సాధించడానికి పార్ట్ టైమ్ జాబ్ లేదా ఫ్రీలాన్స్ ఎంప్లాయిమెంట్ చేసుకోవచ్చు. మీ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు, అదనపు ఆదాయాన్ని చూసుకోవడం కూడా ముఖ్యం.