టర్కీలో మళ్లీ ప్రకంపనలు

టర్కీలో మళ్లీ ప్రకంపనలు

న్యూఢిల్లీ: ఇప్పటికే భూకంపంతో అతలాకుతలం అవుతున్న టర్కీలో సోమవారం అర్థరాత్రి మళ్లీ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు ఇందులో ముగ్గురు మరణించినట్లు ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. రిక్టర్​ స్కేల్​పై దీని తీవ్రతను 6.6గా గుర్తించామన్నారు. ఇప్పటివరకూ 40వేలకు పైగా భూకంపం వల్ల చనిపోయారు. దాదాపు 1,05,794 భవనాలు దెబ్బతిన్నాయి. 20,662 భవనాలు పూర్తిగా కూలిపోయాయి. 6,040 ప్రకంపనలు సంభవించినట్లు ఏఎఫ్‌ఏడీ వెల్లడించింది. మరోవైపు ప్రపంచ దేశాలు టర్కీ, సిరియాలకు సహాయక చర్యలను ఆపివేసినప్పటికీ, పలు వస్తువులను మాత్రం అందజేస్తున్నాయి. ఇంకో వైపు సిరియా ప్రభుత్వం శిథిలాల తొలగింపును ముమ్మరం చేసింది. కాగా ఇళ్లు కూలిపోవడంతో అక్కడి ప్రజల మౌలిక సదుపాయల కల్పననే ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. రోజురోజుకు పారిశుద్ధ్య పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుండడం ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుంది. దీంతో వ్యాధులు ప్రబలే అవకాశం లేకపోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, స్నానపానాలకు సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.