పెద్దన్న ఇంటిలో సోదాలు

పెద్దన్న ఇంటిలో సోదాలు
  • జో బైడెన్ ను ఇండ్లు, కార్యాలయాల తనిఖీ
  • రహస్య పత్రాల వేటలో అమెరికా న్యాయవ్యవస్థ
  • కీలక డాక్యుమెంట్లు, ఫొటోలు స్వాధీనం

అమెరికా: అమెరికా అధ్యక్షుడు,  ప్రపంచదేశానికి పెద్దన్నగా చెలామణి అయ్యే జో బైడెన్ ఇంటిలో కొద్ది రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు. జో బైడెన్ సెనేటర్గా, ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా, ఇతర దేశాలకు సంబంధించిన భద్రత అంశాలు, ఆయుధాల కొనుగోలులో అవినీతి, అక్రమాలకు సంబంధించిన, అమెరికా ఫెడరల్ చట్టానికి సంబంధించిన కీలకపత్రాలను తన వద్ద దాచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఓ ప్రత్యేకాధికారి సీనియర్ లాయర్ను విచారణ, తనిఖీ అధికారిగా నియమించారు. ఆయన నేతృత్వంలో జో బైడెన్ ఇండ్లు, ఆఫీసులలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. విషయం బయటికి పొక్కడంతో జో బైడెన్, ఆయన భద్రతాధికారులు కూడా పూర్తిగా విచారణకు సహకరిస్తుండడం విశేషం.

అనేక పత్రాలు 
జో బైడెన్ ఇంటిలో ఆరు రహస్య పత్రాలు దొరికాయని ఆయన లాయర్ బాబా బావూర్ వెల్లడించారు. కొన్ని పత్రాలలో అమెరికా సెనెట్కు సంబంధించిన కార్యకలాపాలవని వివరించారు. 1973 నుంచి 2009 వరకూ డెలావేయర్కు సెనేటర్గా జోబైడెన్ సేవలందించారు. 2009 నుంచి 2017 వరకు బరాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నపుడు ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ఇప్పటివరకూ జోబైడెన్ ఇండ్లు, ఆఫీసులలో నాలుగుసార్లు తనిఖీలు జరగగా, నాలుగుసార్లు కూడా ఏవో కొన్ని రహస్య పత్రాలు దొరికాయని సమాచారం. మొదటిసారి వాషింగ్టన్ కార్యాలయంలో, రెండోసారి విల్లింగ్టన్  కార్యాలయంలో, మూడోసారి ఆయన ఇంటిలోని కారు గ్యారేజ్లో, నాలుగోసారి ఆయన ఇంటిలోని గ్రంథాలయంలో కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
 
మీడియా మల్ చల్
దేశ రహస్య పత్రాల విషయంలో అధ్యక్షుడు జోబైడెన్ వ్యవహారం అనుమానాస్పదంగా గోచరిస్తోందని అమెరికా పత్రికలు, చానళ్లు కోడై కూస్తున్నాయి. ఆయన ఇంట్లో వెతికే కొద్దీ రహస్య పత్రాలు వెలుగు చూస్తుండడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. కీలకపత్రాలు, ఫొటోలు, ల్యాప్టాప్లు, ఓ కార్డ్బోర్డ్ పెట్టెను శ్వేతసౌధం నుంచి తీసుకెళ్లినట్లు నిఘాధికారులు గుర్తించారు.  బైడెన్ పాత కార్యాలయంలో నవంబర్ రెండున కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. జస్టిస్ డిపార్ట్మెంట్ పత్రాలను డెలావేర్లోని విల్మింగ్టన్లో ఉన్న ఇంట్లో గుర్తించారు. కాగా పత్రాలు వేటికి సంబంధించినవి అనేదాని మీద మాత్రం ఇంకా భద్రతాధికారులు క్లారిటీ ఇవ్వడం లేదు. ఏదో పెద్ద అంశానికి చెందిన రహస్య పత్రాలనే జో బైడెన్ తన ఇంట్లో దాచుకున్నట్లుగా మాత్రం అర్థం అవుతుంది.