Taiwan massive earthquake ఊయలలా ఊగిపోయిన రోడ్డు, రోడ్డుపై వాహనాలు... తైవాన్ భూకంపం వీడియో వైరల్

Taiwan massive earthquake ఊయలలా ఊగిపోయిన రోడ్డు, రోడ్డుపై వాహనాలు... తైవాన్ భూకంపం వీడియో వైరల్

తైవాన్ లో 25 ఏళ్ల తర్వాత భారీ భూకంపం
రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదు
ఏడుగురి మృతి... 736 మందికి గాయాలు

తైవాన్ ను ఇవాళ భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రత నమోదైంది. తైవాన్ లో దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదే ప్రథమం. తాజా భూకంపం ధాటికి ఇప్పటివరకు ఏడుగురు మరణించారు. 736 మంది గాయపడ్డారు. 77 మంది టన్నెల్స్ లో చిక్కుకుపోయారు. వందల సంఖ్యలో ప్రజలు తమ వాహనాలు సహా హైవేలపై నిలిచిపోయారు. చాలాచోట్ల భవనాలు ఒరిగిపోయాయి. అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

తైవాన్ భూకంపానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ ఫ్లైఓవర్ పై వాహనాలు వెళుతుండగా, ఒక్కసారిగా రోడ్డు ఊయలలా ఊగిపోవడం వీడియోలో రికార్డయింది. దాంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అయినప్పటికీ, భూ ప్రకంపనల కారణంగా రోడ్డు ఊగిపోయింది. ఇలా కొన్ని సెకన్ల పాటు సాగింది.