పరువు నష్టం దావా.. కోర్టుకు  ప్రిన్స్​ హ్యారీ!

పరువు నష్టం దావా.. కోర్టుకు  ప్రిన్స్​ హ్యారీ!

లండన్​: ప్రిన్స్ హ్యారీ ప్రవర్తనపై సండే మిర్రర్ కథనం పరువునష్టం దావా వేసిన బ్రిటన్ యువరాజు వచ్చేవారం ఈ కేసు విషయంలో లండన్​ హైకోర్టుకు హాజరుకానున్నారు. దీంతో 130 ఏళ్ల తర్వాత కోర్టుకు సాక్షిగా హాజరవుతోన్న బ్రిటన్ రాజవంశానికి చెందిన మొదటి వ్యక్తిగా హ్యారీ నిలవనున్నారు. రాజు కావడానికి ముందు ఎడ్వర్డ్ 7‌‌– 1870లో విడాకుల కేసులో, 1890లో కార్డ్ గేమ్‌ ఆరోపణలపై పరువునష్టం దావా విచారణకు హాజరయ్యారు. రెండింటిలోనూ ఒక సీనియర్ రాయల్ సాక్ష్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత ఇప్పటి వరకూ బ్రిటన్ రాజకుటుంబంలోని ఎవరూ కోర్టుకు వెళ్లకపోవడం గమనార్హం. రెండేళ్ల కిందట రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ బ్రిటీష్ మీడియాతో చట్టపరమైన వివాదాలు, ఇతర సీనియర్ రాయల్‌‌పై ఆరోపణలు, నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్‌ల విడుదల వంటి వివాదాలతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. మిర్రర్​ జర్నలిస్టులపై ఫోన్​ హ్యాకింగ్​, సమాచారం పొందేందుకు చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జర్నలిస్టు మోర్గాన్, హ్యారీ కుటుంబ గోప్యతను అతిక్రమించాడనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.