పర్యావరణ పరిరక్షణ అందరి భాధ్యత - మంత్రి జగదీష్ రెడ్డి

పర్యావరణ పరిరక్షణ అందరి భాధ్యత - మంత్రి జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట గ్రీన్ క్లబ్ ప్రెసిడెంట్  ముప్పారపు నరేందర్, కన్వీనర్ రాచర్ల కమలాకర్    ఆధ్వర్యంలో సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ వద్ద సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో సుధాకర్ పివిసి ఎండి మీలా మహదేవ్ ఆధ్వర్యంలో రూపొందించిన  365 పర్యావరణ సూక్తుల పుస్తకాన్ని  మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రతి ఏటా  హరితహారం కార్యక్రమం నిర్వహిస్తూ కోట్లాది మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ కు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అటవి విస్తీర్ణం పెంచడానికి సిఎం కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటవి ప్రాంతం తక్కువగా వుండడం వలన భూతాపం పెరిగి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ శాఖల ద్వారా  చెట్ల పెంపకం భారీ ఎత్తున చేపడుతున్నట్లు చెప్పారు. 

భూమి మీద మనుషులు మాత్రమే పర్యావరణ నాశనానికి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ‌ఈ సందర్భంగా  గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సూర్యాపేట సభ్యులు పర్యావరణ పరిరక్షణ కోసం  చేస్తున్న ప్రయత్నాన్ని ప్రశంసించారు... ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా  గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ క్లబ్ సభ్యులు మీలా మహదేవ్, తోట శ్యామ్ ప్రసాద్, ముప్పారపు నాగేశ్వరరావు, సెక్రటరీ డాక్టర్ తోట కిరణ్, ట్రెజరర్ ఉప్పల శ్రవణ్, న్యాయవాదులు గోండ్రాల అశోక్, తల్లమల్ల హస్సేన్, చల్లా లక్ష్మి ప్రసాద్, నల్లపాటి మమత, బంగారు పద్మ, కందిబండ వాణి, ముప్పారపు విజయ, డాక్టర్ శరీష తదితరులు పాల్గొన్నారు.