సహాయక చర్యల్లో వేగం పెంచాలన్న ప్రధాని

సహాయక చర్యల్లో వేగం పెంచాలన్న ప్రధాని

ఒడిశా: ఒడిశా ప్రమాదంపై సహాయక చర్యల్లో వేగం పెంచాలని  ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదివారంనాడు రైల్వేశాఖమంత్రికి ఫోన్​లో ఆదేశించారు. దగ్గరుండి సహాయక చర్యలను కొనసాగించాలన్నారు. అదే సమయంలో ప్రమాదం బారిన పడి గాయాలపాలైన వారికి అందించాల్సిన సహాయక చర్యల్లో ఎలాంటి లోటు ఉండకూడదన్నారు. ప్రమాదం అనంతరం శనివారం ప్రధాని మోడీ బాలేశ్వర్​ఘటనా స్థలంలోని పరిస్థితిని పర్యవేక్షించారు. రైల్వేశాఖ, ఎన్డీఆర్​ఎఫ్​, పోలీసు, వైద్యశాఖాధికారులు, మంత్రులతో మాట్లాడారు. గాయాలపాలైన వారిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.  అనంతరం ఢిల్లీ వెళ్లిన ప్రధాని అదేరోజు రాత్రి ప్రమాదంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కవచ్​ను వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా అమలు చేసే విషయంపై చర్చ జరిగినట్లు పలువురు వెల్లడించారు.