Bridge Collapses Bihar: బీహార్​లో చూస్తుండగానే గంగలో కూలిన వంతెన!

Bridge Collapses  Bihar: బీహార్​లో చూస్తుండగానే గంగలో కూలిన వంతెన!
  • రూ. 1717 కోట్లు నీటిపాలు
  • విచారకరమన్న జేడీయూ నేతలు

బీహార్​: బీహార్​భగల్​పూర్​లో రూ. 1717 కోట్లతో నిర్మిస్తున్న ఓ బ్రిడ్జి ఆదివారం కుప్పకూలింది. గంగా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జి కుప్పకూలుతున్న వీడియో బయటకు రావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. బ్రిడ్జి కూలిన ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ వంతెన కగాడియా–అగువానీ–సుల్తాన్​గంజ్​ల మధ్య నిర్మితమవుతోంది. రెండేళ్ల క్రితం కూడా ఈ వంతెనకు సంబంధించిన కొంతభాగం ధ్వంసమైంది. నాలుగేళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి బీహార్​ సీఎం నితీశ్​కుమార్​ శ్రీకారం చుట్టారు. దీని నిర్మాణం రూ. 1717 కోట్లతో చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

WATCH HERE: https://twitter.com/i/status/1665356191453544448

ఈ వంతెనలోని కొంత భాగానికి ఏప్రిల్​లో వచ్చిన భీకర గాలుల వల్ల కూడా కొంతమేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. వీడియోలో చూస్తుండగానే వంతెన గంగలో కూలిపోతుండడం కనిపిస్తుంది. వంతెన కూలిన విషయంపై ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. వంతెన కూలిపోవడంతో జేడీయూ పార్టీ నేతలు మాట్లాడుతూ.. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఏడాది నవంబర్​లో దీన్ని ప్రారంభించాలని అనుకున్నామన్నారు. వంతెన కూలిపోవడం వెనుక ఉన్న కారణాన్ని ఆరాతీసేందుకు విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. నాసిరకమైన వంతెన నిర్మాణం చేపట్టినందుకు కాంట్రాక్టర్​పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.