భారత్​ జనాభా 139 కోట్లు

భారత్​ జనాభా 139 కోట్లు
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​రాయ్ 
  • పార్లమెంట్​లో అడిగిన ప్రశ్నకు మంత్రి వివరణ

న్యూఢిల్లీ: భారత జనాభాకు సంబంధించి​కాంగ్రెస్​ఎంపీ దీపక్ జైన్ లోక్​సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశంగా అవతరించిందా? అని ఎంపీ ప్రశ్నించారు. దీంతో రాయ్​సమాధానమిస్తూ.. యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అంచనాల ప్రకారం జూలై 1, 2023 నాటికి భారతదేశ జనాభా అంచనా 139,23,29,000 అని తెలిపారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేషనల్ పాపులేషన్ కమిషన్ ప్రచురించిన జనాభా అంచనాలపై సాంకేతిక బృందం నివేదిక ప్రకారం, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మినహా కుల ప్రాతిపదికన జనాభా గణన జరగలేదని రాయ్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు కుల ఆధారిత డేటాను డిమాండ్ చేశాయని అన్నారు. అయితే ఈ విషయంలో ఇంకా కేంద్రం ఓ నిర్ణయానికి రాలేదన్నారు. కాగా జనాభా విషయంలో జూలై 1, 2023 నాటికి చైనానే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. చైనా జనాభా 142,56,71,000.