శక్తి పరివర్తన్​లో భారత్​ బలమైన దేశం..

శక్తి పరివర్తన్​లో భారత్​ బలమైన దేశం..
modi speech in shakthi parivarthan
  • 20 ఏళ్ళలో రెండువేల హెలికాప్టర్ల ఉత్పత్తి లక్ష్యం..
  • ఉత్పాదకత పెంపుదలకు, అన్వేషణకు బడ్జెట్​లో ప్రత్యేక నిధుల కేటాయింపు
  • గోవర్ధన్​ యోజన ద్వారా బయోప్లాంట్ల ఏర్పాటు
  • ‘ఇండియా ఎనర్జీవీక్​–2023’లో ప్రధాని మోడీ

కర్ణాటక: భారత్​గ్రీన్​ ఎనర్జీ ఉత్పాదనలో రాబోయే సమయంలో ప్రపంచంలోనే ముందువరుసలో ఉంటుందని, ఇందుకు తగిన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుందని ఈ నేపథ్యంలోనే అనేక చర్యలు చేపట్టామని బడ్జెట్​లో దీనికి సంబంధించి నిధులను కేటాయించామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 21వ శతాబ్దంలో ప్రపంచ భవిష్యత్‌ను నిర్ణయించడంలో ఇంధన రంగం, విద్యుత్​, సోలార్​, హైడ్రోజన్​, బయోఫ్ల్యూయల్​, బయోగ్యాస్​, ఎలక్ర్టిక్​, హైడ్రోజన్​ల వాడకాలు పెంచాలన్న ఉద్దేశంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో నూతన వనరులను ఏర్పాటు చేయడం, ఆయా రంగాల్లో ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు భారత్​ స్వర్గధామంలా నిలుస్తుందన్నారు. కొత్త శక్తి వనరులను అభివృద్ధి చేయడంలో, శక్తి పరివర్తనలో భారత్ నేడు బలమైన దేశంగా ఉందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ఇండియా ఎనర్జీ వీక్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. బెంగుళూురు సాంకేతికత, ప్రతిభ ఆవిష్కరణల శక్తితో నిండిన నగరం అంటూ ప్రధాని మోడీ కొనియాడారు. నిరంతరం యువశక్తిని ఉపయోగించుకుంటూ ఉండాలని సూచించారు. 

సోమవారం బెంగుళూరులో జరుగుతున్న India Energy Week – 2023 ‘ఇండియా ఎనర్జీ వీక్​–2023’లో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొని ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ కర్ణాటకలోని తూముకుర్​లో ‘హెచ్​ఏఎల్​’ హెలికాప్టర్ల తయారీ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ 600 ఎకరాల్లో విస్తరించి ఉంది. 20 సంవత్సరాలలో 2000 హెలికాప్టర్లు చేయడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యమని దీంతో వీరు తయారు చేసిన హెలికాప్టర్లు దేశంలో వాడుకోవడమే కాకుండా విదేశాలకు కూడా దిగుమతి చేస్తామన్నారు. ఇక్కడ తయారయ్యే హెలికాప్టర్లలో 3 టన్నుల నుంచి 15 టన్నుల వరకూ బరువు ఉంటాయి.  భారత్​లో 2014లో గ్యాస్​ పైప్​లైన్లు, సీఎన్టీ, సోలార్​ వినియోగం, పెట్రోల్​ వినియోగం ప్రస్తుత వినియోగంతో పోల్చుకుంటే చాలా ముందున్నామన్నారు. సీఎన్జీ ఉత్పత్తిలో 2014లో 900 స్టారీయమ్​ ఉండగా, ప్రస్తుతం ఐదువేల స్టారీయమ్​ వరకు ఉందని, 14వేల కిలోమీటర్ల పొడవు ఉన్న గ్యాస్​పైప్​లైన్లు, ప్రస్తుతం 22వేలకు పెరిగాయని నాలుగేళ్ళలో 35 వేలకు పెంచుతామన్నారు.

సోలార్​పవర్​ ప్లాంట్లను నెలకొల్పడం ఈ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం వంటి అవకాశాలను కల్పిస్తామన్నారు. డొమెస్టిక్​ ఉత్పత్తిని పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2030 నాటికి ఎనర్జీ ఉత్పాదనలో భారత్​ వృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం నేషనల్​ గ్యాస్​ఉత్పాదకత 6 శాతంగా ఉంటే వచ్చే నాలుగేళ్ళలో అది 15 శాతానికి పెంచుతామన్నారు.  గోవర్ధన్​ యోజన ద్వారా బయోప్లాంట్​ల ఏర్పాట్లు, గ్రీన్​ హైడ్రోజన్​ప్రోత్సహించడంతో ఈ రంగంలో 8 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో భూమిపై ఉన్న వనరులకు కొరత ఏర్పడే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రపంచదేశాలన్ని ఇతర మార్గాల అన్వేషణలో కొనసాగుతున్నాయని, ఇందులో భారత్​కూడా ఏమీ తీసిపోలేదని అన్నారు. ఈ రంగాల్లో స్వచ్ఛందంగా దేశీయంగా తయారైన ఎలాంటి ఉత్పత్తులనైనా ప్రోత్సహిస్తామన్నారు. భవిష్యత్​ భారత్​దే అని నిరూపించుకునేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచ ఏకానమీలో భారత్​ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.