నల్ల దుస్తులతో ‘ఇండియా’ నిరసన

నల్ల దుస్తులతో ‘ఇండియా’ నిరసన
  • మణిపూర్​ఘటనపై మోడీ ఎందుకు మాట్లాడరు : ఖర్గే

న్యూఢిల్లీ: మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్ ఉభయ సభల్లో గురువారం పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలు చేశారు. దీంతో కేవలం 6 నిమిషాల తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. మరోవైపు ఇండియా విపక్ష పార్టీల నేతలు నల్లబట్టలతో కేంద్ర వైఖరిపై నిరసన తెలిపారు. మరోవైపు, రాజ్యసభలో కూడా ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులతో వచ్చి ప్రధాని సభకు రండి, సభకు రండి, మాట్లాడండి, ప్రధాని మౌనం వీడండి.. అంటూ నినాదాలు చేస్తూ కనిపించారు. దీంతో ఎన్డీయే ఎంపీలు మోడీ.. మోడీ.. అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. కాగా పార్లమెంట్, రాజ్యసభ సభల్లో పాల్గొనేముందు ఇండియా నేతలు సమావేశమై నల్ల దుస్తులతో నిరసన తెలపాలని నిర్ణయించారు. ఏఐసీసీ సీనియర్​ నేత రాహుల్​గాంధీ మాట్లాడుతూ ప్రధానమంత్రి మాట్లాడే తీరు, తన భావజాలమే మణిపూర్​ హింసకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్​జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రధాని మోడీ పార్లమెంటులో మణిపూర్​అంశంపై మాట్లాడడం లేదు ఎందుకని అని ప్రశ్నించారు.

  • జమిలీ ఎన్నికల అంశం లా కమిషన్​పరిశీలనలో ఉంది

జమిలి ఎన్నికల అంశం లా కమిషన్​పరిశీలనలో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్​రామ్​మేఘవాల్​స్పష్టం చేశారు. లోక్​సభ, రాష్ర్టాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఎన్నికల కోసం ఆచరణాత్మకమైన రోడ్​మ్యాప్​ను కూడా సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జమిలీపై ఎన్నికల సంఘం ఇప్పటికే వివిధ భాగస్వాములతో కూడా చర్చించిందని మంత్రి పేర్కొన్నారు.