డీకే వర్సెస్​ సిద్ధి రామయ్య

డీకే వర్సెస్​ సిద్ధి రామయ్య

కన్నడ కాంగ్రెస్​లో సీఎం సీటు పంచాయతీ మొదలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​  మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంలో డీకే శివ కుమార్​ పాత్ర ముఖ్యమని ఇప్పటికే ఏఐసీసీ పలుమార్లు మెచ్చుకున్నది. ప్రస్తుతం పార్టీ పగ్గాలు డీకే చేతిలో ఉండగా.. అధికారిక బాధ్యతలను సిద్ధి రామయ్యపై పెట్టారు. గత ఎన్నికల వరకు ఈ ప్రక్రియ ఉంది. శివ కుమార్​ కాంగ్రెస్​ను అంటీపెట్టుకుని ఉండగా, సిద్ధి రామయ్య బీజేపీ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్​ గెలుపులో డీకే శివ కుమార్​ ది కీలక బాధ్యతగా మారింది. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేలను కాపాడే బాధ్యతలను కూడా ఆయనకే ఇచ్చారు. ఆయన వర్గీయులతో పాటుగా పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులను ఆయన ఆధ్వర్యంలోనే క్యాంపునకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం సీటు పంచాయతీపై కర్ణాటకలో పలు ప్రచారాలు మొదలయ్యాయి.

సీఎంగా సిద్ధి రామయ్య, పార్టీ చీఫ్​గా డీకే శివ కుమార్​ కొనసాగుతారని పార్టీలోప్రచారం మొదలైంది.కానీ, సీఎం సీటు కోసం ఈసారి డీకే కూడా పోటీ పడుతున్నారు. తాజా ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. దీంతో సీఎం సీటు ఎవరిని వరిస్తుందనే ప్రచారం మొదలైంది. పార్టీలోని మెజార్టీ వర్గం మాత్రం డీకే శివ కుమార్​కు మద్దతుగా ఉన్నట్లు చెప్తున్నారు. ఇక, డీకే శివ కుమార్​ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా ఉంటుందని టీపీసీసీ భావిస్తున్నది. టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డికి డీకే శివ కుమార్​తో సన్నిహిత సంబంధాలున్నాయి. టీపీసీసీ చీఫ్​ నియామకం కోసం శివ కుమార్​ సపోర్ట్​ చేశారనే టాక్​ కూడా ఉంది.అంతేకాకుండా మాస్​ లీడర్​గా శివ కుమార్​కు రాష్ట్రంలో అభిమానులున్నారు.