కరోనా సోకితే దీర్ఘకాలిక ఇన్షెక్షన్లు తప్పవు

కరోనా సోకితే దీర్ఘకాలిక ఇన్షెక్షన్లు తప్పవు
  • భవిష్యత్​లో మరిన్ని అనారోగ్య సమస్యలు
  • స్పష్టం చేసిన డబ్ల్యూహెచ్ఓ 

న్యూఢిల్లీ: కరోనా బారిన పడ్డ వారికి డబ్ల్యూహెచ్ఓ( వరల్డ్​హెల్త్​ఆర్గనైజేషన్) వెల్లడించిన వివరాలు మరింత టెన్షన్​కు గురి చేస్తున్నాయి. కరోనాతో సోకిన ఇన్ఫెక్షన్లు త్వరగా తొలగిపోవని, దీర్ఘకాలికంగా ఉంటాయని యూరప్​వరల్డ్​హెల్త్ ఆర్గనైజేషన్​రిజనల్ డైరెక్టర్​డాక్టర్ హాన్స్ క్లూగే​స్పష్టం చేశారు. వారికి భవిష్యత్​లో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ఆస్కారం ఉందని పేర్కొన్నారు. యూరప్ వ్యాప్తంగా 36 మిలియన్ల మంది కరోనా బారిన పడ్డారని ఆయన తెలిపారు. అంతకుముందు, ప్రపంచ మహమ్మారి జాబితా నుంచి కరోనాను డబ్ల్యూహెచ్​ఓ తొలగించిన విషయం తెలిసిందే. పూర్తి వ్యాధి నివారణ మందు కనిపెట్టేదాకా కరోనాతో అప్రమత్తంగా ఉండటమే శ్రేయస్కరమన్నారు. కరోనా ఇన్షెక్షన్ల నుంచి తప్పించుకోవాలంటే సమయానుకూలంగా వ్యాక్సిన్లు వేసుకుంటూనే ఉండాల్సిందని స్పష్టం చేశారు. లేదంటే అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తల తిరగడం, ఛాతీలో నొప్పి తదితర లక్షణాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హాన్స్​క్లూగే తెలిపారు. కాగా యూరోప్​లో డబ్ల్యూహెచ్ఓ పరిధిలో 53 దేశాలు వస్తాయి. అన్ని దేశాల్లో కలిపి సుమారు 900 మిలియన్ల జనాభా ఉంటుంది.