లోక్ సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం - మద్దతు ఇచ్చిన మజ్లిస్

లోక్ సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం - మద్దతు ఇచ్చిన మజ్లిస్

లోక్ సభలో భారత రాష్ట్ర సమితి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులు ఇచ్చారు. ఆ అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్టులో చేర్చాలని కోరారు.

లోక్‌సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్‌లోని 17వ అధ్యాయంలోని రూల్ 198 (బి) కింద, ఈ క్రింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నోటీసు ఇచ్చింది. ఇవాళ సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా ఆ పార్టీ కోరింది.

దీనికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ [ఏఐఎంఐఎం] పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిపై ఏఐఎంఐఎం అధినేత, లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు.