ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని 

ఆసుపత్రిలో చేరిన మాజీ ప్రధాని 

 మాజీ ప్రధాని దేవెగౌడ  బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో  చేరారు.  గత కొన్నిరోజులుగా దేవెగౌడకు కాళ్ల వాపులు, మోకాలి నొప్పులతో బాధపడుతున్నారని,  అందుకే ఆసుపత్రిలో చేరినట్లు ఆయన అల్లుడు, జయదేవ కార్డియాలజీ ఆసుపత్రి డైరెక్టర్‌ సీఎన్‌ మంజునాథ్‌ తెలిపారు.

దేవెగౌడ ఆసుపత్రిలో చేరిన విషయమై సాగుతున్న ప్రచారాలపై ఆయన స్పందించారు.   దేవెగౌడ ఆరోగ్యంగా ఉన్నారని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వయోసహజ ఆరోగ్య సమస్యలు మి నహా ఇతరత్రా ఎటువంటి చికిత్సలు అవసరం లేదన్నారు.