మూడు నెలల్లో పదిమందిని కరిచిన జో బైడెన్​పెంపుడు కుక్క!

మూడు నెలల్లో పదిమందిని కరిచిన జో బైడెన్​పెంపుడు కుక్క!

వాషింగ్టన్​: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​శునక మహరాజు గత మూడు నెలల్లోనే 10సార్లు సెక్యూరిటీని కరవడం కలకలం రేపుతోంది. అధ్యక్షుడికి షెఫర్డ్​ జాతికి చెందిన ‘కమాండర్​’ అనే శునకం ఉంది. అయితే ఈ మధ్య గత మూడు నెలల్లో సెక్యూరిటీని పది సార్లు కరిచినట్లు వైట్​హౌస్​ వర్గాలు వెల్లడించాయి. అసలే అమెరికా అధ్యక్షుడి కుక్క కరవడంతో చేసేదేం లేక సెక్యూరిటీ సిబ్బంది చికిత్స చేయించుకుంటున్నారట.

గతంలో కూడా ఇలాగే కొంతమంది సీక్రెట్​ సర్వీస్​ అధికారులు కూడా కమాండర్​ కరిచిందని సమాచారం. ఈ విషయం అధ్యక్షుడి వరకూ పొక్కడంతో దాన్ని డెలావేర్​లోని వెల్మింగ్టన్​లో తన నివాసానికి బైడెన్​ తరలించినట్లు సమాచారం. ఏది ఏమైనా ఎంత అమెరికా అధ్యక్షుడి శునకమైనా అస్తమాను దానికి స్వేచ్ఛ అనేది లేకుండా సెక్యూరిటీ వ్యవహరిస్తే కరవదా ఏంటి? అనే కామెంట్లు సోషల్​ మీడియాలో వినిపిస్తున్నాయి.