యూఎస్ లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతదేహం లభ్యం

యూఎస్ లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి మృతదేహం లభ్యం
మహ్మద్ అబ్దుల్ ఆర్ఫత్ (ఫైల్ ఫొటో)

క్లీవ్ లాండ్: కొద్దిరోజుల క్రితం అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ కు చెందిన విద్యార్థి మహ్మద్ అబ్దుల్ ఆర్ఫత్ (25) మృతదేహం లభ్యమైందని అమెరికాలోని న్యూయార్స్ లో గల భారతీయ దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ విద్యార్థి 2023లో క్లీవ్ లాండ్ రాష్ట్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గాను వెళ్లాడు. మూడు వారాల క్రితం నుంచి ఈ విద్యార్థి అదృశ్యమయ్యాడు. చివరికి మంగళవారం ఉదయం అర్ఫత్ మృతదేహం లభ్యమైంది. మార్చి 7వ తేదీన చివరిసారిగా అర్ఫత్ తమతో మాట్లాడాడని, ఆ తర్వాత నుంచి అతని సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యిందని ఆయన తండ్రి మహ్మద్ సలీమ్ చెబుతున్నారు. తర్వాత మార్చి 19న ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి సలీమ్ కు ఒక కాల్ వచ్చింది. ఆ నెంబర్ నుంచి మాట్లాడిన అజ్ఞాత వ్యక్తి . మీ కుమారుడిని కిడ్నాప్ చేశామని 1200 యూఎస్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా చెబుతున్నారు. అయితే, తనకు కాల్ చేసిన వ్యక్తి ఆ మొత్తం ఎలా పంపించాలన్నది ఏమీ చెప్పలేదని సలీమ్ ఒక న్యూస్ సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. తన కుమారుడితో మాట్లాడించాలని అభ్యర్థించినా కూడా అందుకు ఆ ఆగంతకుడు అంగీకరించలేదని చెప్పాడు. మత్తు పదార్థాలు విక్రయించే ఒక ముఠా తమ కుమారుడిని అపహరించినట్టుగా ఆయన అనుమానిస్తున్నారు. చివరికి అర్ఫత్ మృతదేహం లభ్యమైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారతీయ విద్యార్థుల అనుమానాస్పద మరణాలలో ఇది పదకొండవది కావడం గమనార్హం.