బైడెన్​ హత్యకు కుట్ర కేసులో కొనసాగుతున్న దర్యాప్తు 

బైడెన్​ హత్యకు కుట్ర కేసులో కొనసాగుతున్న దర్యాప్తు 

అమెరికా అధ్యక్షుడు బైడెన్​ హత్యకు కుట్ర కేసులో కొనసాగుతున్న దర్యాప్తు. నిందితుడు సాయి వర్షిత్​ను ఫెడరల్​ కోర్టులో హాజరుపరిచిన అమెరికా పోలీసులు. వచ్చే మంగళవారం వరకు అతన్ని జైల్లో ఉంచాలని కోర్టు ఆదేశించింది. నిందితుడు అమెరికా పౌరుడు కాదని పోలీసులు తెలిపారు. అతను గ్రీన్​కార్డు హోల్డర్​ అని కోర్టుకు వివరించిన పోలీసులు. విచారణలో సాయి వర్షిత్​ కుటుంబానికి ఇబ్బందులు కలిగించబోమని పోలీసులు తెలిపారు. తనకు నాజీలు, హిట్లర్​ అంటే అభిమానమని అతను చెప్పాడు. అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యమని అన్నాడు. తాను వైట్​హౌస్​లోకి వెళ్లలేకపోయినా తన సందేశం అందరికీ చేరిందని అన్నాడు. యూ–ట్రక్కును రెంట్​కు తీసుకొని ఇతను వైట్​హౌస్​ వద్దకు వెళ్ళాడు. ట్రక్కు బారికేడ్లను ఢీకొట్టగానే సంతోషంతో నాజీ జెండా ఎగరేశాడు.