పుతిన్‌కు అరెస్టు వారెంట్‌పై  స్పందించిన చైనా

పుతిన్‌కు అరెస్టు వారెంట్‌పై  స్పందించిన చైనా

బీజింగ్‌: రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు వారెంట్‌పై చైనా స్పందించింది. ఐసీసీ తన ద్వంద్వ వైఖరిని విడనాడాలని హితవు పలికింది. 'ఐసీసీ నిష్పాక్షిక వైఖరితో వ్యవహరించాలి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అరెస్టుల వంటి వాటి నుంచి దేశాధినేతలకున్న ఇమ్యూనిటీని గౌరవించాలి. అలాగే ఐసీసీ రాజకీయాలకు దూరం ఉండటంతో పాటు ద్వంద్వ వైఖరిని విడనాడాలి' అని చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ కోరారు.

ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ తాము వారెంట్‌ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు ఈ నేరాలకు పాల్పడినట్లు పేర్కొంది. అయితే.. తాము ఐసీసీని గుర్తించడం లేదని, అందువల్ల దాని చర్యలు రష్యాపై చెల్లుబాటుకావని క్రెమ్లిన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.