ఇజ్రాయిల్ పై పాలస్తీనా దాడి

ఇజ్రాయిల్ పై పాలస్తీనా దాడి

ఇజ్రాయిల్ : ఇజ్రాయిల్​, పాలస్తీనా దేశాల మధ్య యుద్దం ముదిరింది. పాలస్తీనాకు చెందిన హమాస్​ తీవ్రవాద సంస్థ ఇజ్రాయిల్ పై విరుచుకుపడింది. 20 నిమిషాల్లో హమాస్​ 5వేల రాకెట్లు ప్రయోగించింది. ఇందులో 50మంది ఇజ్రాయిల్​ పౌరులు మృతిచెందారు. మరో వంద మంది గాయాలపాలయ్యారు. అలాగే 30 మంది ఇజ్రాయిల్​ పౌరులను హమాస్​ నిర్భందించింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం.. దేశం దక్షిణ, మధ్య ప్రాంతాలలో ఒక గంటకు పైగా సైరన్లతో ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. బాంబు షెల్టర్ల దగ్గర ఉండాలని ప్రజలను కోరింది. అనేక మంది ఉగ్రవాదులు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడినట్టుగా ఆ దేశ సైన్యం గుర్తించింది. మరోవైపు చొరబాటుకు సంబంధించి ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన విడుదల చేసింది. గాజా వైపు నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారని తెలిపింది.