ఆర్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై  2కె రన్ ర్యాలీ | Mudra News

ఆర్బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణపై  2కె రన్ ర్యాలీ | Mudra News

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : గద్వాల  జిల్లా కేంద్రంలో ఆర్బీఐ  ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ పై బ్యాంకు అధికారులు మంగళవారం ఉదయం  పాత బస్టాండ్ నుంచి కృష్ణవేణి చౌక్ వరకు విద్యార్థులతో కలసి  2కె రన్ ర్యాలీ నిర్వహించారు. లిటరసీ వీక్ పేరుతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాట్లు చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ప్రతి ఒక్కరూ లిటరసి వీక్ అనే అంశంపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశ్యం తో 2కె రన్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.